
- తాండూరు మున్సిపల్ ఓటర్ల ముసాయిదా విడుదల
- మొత్తం ఓటర్లు..77,110
- పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికం
- జనవరి 9 వరకు అభ్యంతరాల స్వీకరణ
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. పట్టణంలోని 36 వార్డులకు సంబంధించిన వివరాలను మున్సిపల్ కార్యాలయంలో ప్రదర్శించారు. ఈ జాబితా ప్రకారం తాండూరు పట్టణంలో మొత్తం 77,110 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.ప్రకటించిన గణాంకాల ప్రకారం పట్టణంలో మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది. మొత్తం ఓటర్లలో 39,558 మంది మహిళలు కాగా, 35,547 మంది పురుషులు ఉన్నారు. ఇతరులు ఐదుగురు ఉన్నారు.
షెడ్యూల్ వివరాలు: ముసాయిదా జాబితాపై ఏవైనా అభ్యంతరాలు లేదా సవరణలు ఉంటే ఫిర్యాదు చేసేందుకు అధికారులు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 5వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు ఇచ్చారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అన్ని సవరణల అనంతరం ఈ నెల 10వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.



