ఎన్నికల బరిలో మాజీ సర్పంచ్ భర్త

- నామినేషన్ దాఖాలు చేసిన పండు పండరి
- గ్రామ అభివృద్ధి లక్ష్యం
జనవాహిని ప్రతినిధి తాండూరు:
మల్కాపూర్ స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలవడంతో, గ్రామీణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో, మల్కాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ విజయలక్ష్మి పండరి భర్త సర్పంచ్ పీఠాన్ని దక్కించుకునేందుకు సిద్ధమయ్యారు.గ్రామ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ సర్పంచ్ లక్ష్మి పండరి అనుభవం కలిగి ఉంది, తాజాగా జరగనున్న సర్పంచ్ ఎన్నికల కోసం పండు పండరి నామినేషన్‌ను దాఖలు చేశారు. మల్కాపూర్ గ్రామానికి అయన భార్య విజయలక్ష్మి మాజీ సర్పంచ్ గా ఉన్న ఇప్పటికీ మంచి పట్టు, అభిమానం కలిగిన దంపతులు, మరోసారి గ్రామ సేవకు పోటీ పడటం స్థానికంగా చర్చనీయాంశమైంది. గతంలో సర్పంచ్‌గా లక్ష్మి పనిచేసిన అనుభవాన్ని, ప్రస్తుతం ఆమె భర్తకు మద్దతుగా నిలుస్తుంది. ప్రజలతో ఉన్న అనుబంధాన్ని పెట్టుబడిగా పెట్టి, ఈసారి కూడా గెలుపు సాధించాలని విజయలక్ష్మి పండరి, పండు లు ఆశిస్తున్నారు. ఈ సందర్బంగా నేడు మండల కార్యాలయం లో సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ ప్రజలతో కలిసి పండు పండరి నామినేషన్ దాఖాలు చేశారు.



