
- తాండూరు మున్సిపల్ 16వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధంజంగం నర్సిములు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ పరిధిలోని 16వ వార్డు అభివృద్ధి ధ్యేయంగా, రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు జంగం నర్సిములు ప్రకటించారు. పార్టీ అధిష్టానం తనకు అవకాశం కల్పిస్తే, వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 16వ వార్డులో మౌలిక సదుపాయాల కల్పన, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, మరియు నిరుపేదలకు ప్రభుత్వ ఫలాలు అందేలా చేయడంలో ప్రస్తుత పాలకులు విఫలమయ్యారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, బీజేపీ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడినై ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఉన్నట్లు తెలిపారు.వార్డు ప్రజల మద్దతుతో, పార్టీ అండతో 16వ వార్డును ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని ఆయన పేర్కొన్నారు.



