బంపర్ ఆఫర్…!

- ఆ ఊరి ఎన్నికల్లో ఒకే ఒక్క ఫ్యామిలీ!
- సర్పంచ్ ఎవరో డిసైడ్ చేసే టెన్షన్ లేదు!
తాండూరు జనవాహిని ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికలంటేనే యుద్ధ వాతావరణం, హామీల సునామీ, ఓటర్లను ఆకర్షించే ట్రిక్కులు… ఇదంతా చూసి చూసి విసిగిపోయిన వారికి, మంతన్ గౌడ్ గ్రామం ఒక ప్యారడైజ్!ఈ ఊళ్లో ఈసారి జరిగిన రిజర్వేషన్లు చూస్తే, గెలుపు అనేది ఎంత సులభమో అర్థమవుతుంది! ఎస్టీ (ST) రిజర్వ్ అయిన సర్పంచ్ పదవిని గెలుచుకోవడం ఎంత సులభమంటే… కళ్ళు మూసుకుని నామినేషన్ వేసినా గెలిచేయొచ్చు!ఎందుకంటే, ఈ గ్రామంలో ఎస్టీ రిజర్వేషన్ కిందకు వచ్చే ఎరుకల కుటుంబం నివాసం ఉంటుంది… ఒకే ఒక ఇల్లు!
సర్పంచ్ పీఠం.. సింగిల్ షాట్లో!
మన భీమప్ప-వెంకటమ్మ దంపతుల కుటుంబమే ఇప్పుడు ఈ గ్రామ రాజకీయాల స్పెషల్ అట్రాక్షన్..! అసలు కథేంటంటే: గతంలోనే వీరి కుటుంబం నుంచి ఇద్దరు ‘వార్డ్ మెంబర్’లుగా ఎన్నికయ్యారు. అంటే, ఎలక్షన్ ఫైటింగ్ ఎలా ఉంటుందో వీరికి బాగా తెలుసు.ఇప్పుడు సరదా ఏంటంటే: భీమప్ప పెద్ద కుమారుడు ఎల్లప్ప, ఆయన భార్య స్వప్న… ఈ ఇద్దరూ మళ్లీ వార్డ్ మెంబర్లుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారట..!
వార్డ్ మెంబర్ పోటీలో ‘అందరూ’ వారే!
అంటే, ఒక కుటుంబంలోని ఇద్దరు భార్యాభర్తలు రెండు వేర్వేరు వార్డులకు నామినేషన్ వేసి, తమకు తామే పోటీదారుల్లా నిలబడబోతున్నారు!
గెలుపు టెన్షన్: సున్నా! ఎదురు పోటీ: సున్నా! ఖర్చు : పార్టీ ఇవ్వడానికి అయినంత మాత్రమే! ఇక, ఊరిలో అసలైన కిక్కిచ్చే అంశం సర్పంచ్ పదవి..!
సర్పంచ్ పోస్ట్ కూడా ఎస్టీ రిజర్వ్ అయింది కాబట్టి, సర్పంచ్ ఎవరో కూడా ఆ భీమప్ప కుటుంబమే డిసైడ్ చేయాలి!ఓటర్లు అంటున్నారు: “మా ఊరిలో పోలింగ్ బూత్ దేనికి? మాకే ఓటు వేయాలా? అని అడిగే అవసరం లేదు. నామినేషన్ వేశామా, గెలిచామా, పీఠం ఎక్కామా! మంతన్ గౌడ్ గ్రామ చరిత్రలో ఈసారి ఎన్నికలు అత్యంత ఏకపక్షంగా, అత్యంత సరదాగా మారబోతున్నాయి!”మొత్తానికి, ఈ కుటుంబం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవడానికి మళ్లీ పోటీకి సిద్ధమవుతోంది. విపక్షాలు లేని, ఖర్చు లేని ఈ ఎన్నికల మహోత్సవం మంతన్ గౌడ్‌కే సొంతం..!



