పుట్టినరోజు వేళ.. సేవా కార్యక్రమాల జోరు

- సేవా కార్యక్రమాలతో కందుకూరి రాజ్ కుమార్ జన్మదినం
- అన్నదానం, వస్త్రదానంతో మిన్నంటిన రాజ్ కుమార్ బర్త్ డే వేడుకలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణ బీసీ కన్వీనర్ కందుకూరి రాజ్ కుమార్ జన్మదిన వేడుకలు మంగళవారం తాండూరు పట్టణంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజకీయ, యువజన సంఘాల నాయకులు పట్టణ వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రాము ముదిరాజ్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్డు మరియు అల్పాహారం పంపిణీ చేశారు.మల్రెడ్డిపల్లి ప్రాంతంలో యువ నాయకులు అనిత రమేష్ ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలను పంపిణీ చేసి అండగా నిలిచారు.నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనిత రాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. రాజ్ కుమార్ నిరంతరం ప్రజాసేవలో ఉంటూ, యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని కొనియాడారు. ఈ వేడుకల్లో పట్టణ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు సంఖ్యలో పాల్గొన్నారు





