NEWS
పార్టీ బలోపేతానికి కృషి చేస్తా..!

- బీఆర్ఎస్లోకి కాంగ్రెస్ యువ నాయకుడు వెంకటేష్
- మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో చేరిక
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపల్ 6వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు వెంకటేష్ (చిన్న) తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఘనంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి యువత ముందుకు రావడం శుభపరిణామమని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు…
బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి, రోహిత్ రెడ్డి నాయకత్వం కోసం నిరంతరం కృషి చేస్తానని ఈ సందర్బంగా వెంకట్ పేర్కొన్నారు.



