నాపై తప్పుడు ప్రచారం ఆపండి…!

- ఏఎస్ కంప్యూటర్స్ అధినేత పద్మనాభ రెడ్డి ఆవేదన
- రెండు దశాబ్దాల నిరంతర సేవ
- సర్టిఫికెట్లే సాక్ష్యం, ఓర్వలేకే బురదజల్లుతున్నారు.
- మనోభావాలు దెబ్బతీయొద్దు
- కోర్ట్ ను ఆశ్రయిస్తా…

జనవాహిని ప్రతినిధి తాండూరు : గత 20 ఏళ్లుగా విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నిస్వార్థంగా సేవలందిస్తున్న తనపై, కొందరు కావాలనే బురదజల్లుతున్నారని ఏఎస్ కంప్యూటర్స్ అధినేత పద్మనాభ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తాండూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు దశాబ్దాలుగా తాండూరు కేంద్రంగా వేలమంది విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను అందిస్తున్నామని ఆయన తెలిపారు.
తన విద్యార్హతలపై వస్తున్న పుకార్లను ఆయన కొట్టిపారేశారు. ఈ సందర్భంగా తన 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్ను మీడియాకు ప్రదర్శించి, తప్పుడు ప్రచారాలకు తెరదించారు.విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కోసం అవసరమైన వారికి లాప్టాప్లు అందజేస్తున్నామని, ఇందులో ఎలాంటి మోసం లేదని స్పష్టం చేశారు. కేవలం శిక్షణలో భాగంగా అవసరమైన వారికి మాత్రమే విక్రయిస్తున్నామని, పాడైన లాప్టాప్లను అమ్మాల్సిన అవసరం తనకు లేదని వివరించారు.ఎవరి దగ్గరా రూపాయి వసూలు చేయకుండా ఉచిత శిక్షణ ఇస్తుంటే, ఓర్వలేక కొందరు తన మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తున్నారని ఆయన వాపోయారు.తెలంగాణ రాష్ట్రంలోనే తాండూరు కంప్యూటర్ డెవలప్మెంట్కు, స్కిల్ డెవలప్మెంట్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఆ గుర్తింపును చెడగొట్టడానికి, నాపై వ్యక్తిగత కక్షతో ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసే పనులను అడ్డుకోవద్దని, పద్మనాభ రెడ్డి తెలిపారు. ఏఎస్ కంప్యూటర్స్త నపై జరుగుతున్న ఈ దుష్ప్రచారాన్ని ప్రజలు, విద్యార్థులు నమ్మవద్దని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ సంఘటనపై తీవ్ర మనస్థాపానికి గురయ్యానని, ఈ తప్పుడు ప్రచారం పై కోర్టుకు వెళ్తానని, పేర్కొన్నారు.



