తాండూరు వేదికగా వరంగల్ విజయఢంకా!

- షూటింగ్ బాల్ రాష్ట్రస్థాయిలో వరంగల్ సత్తా!
- తాండూరులో ముగిసిన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల ఎంపికలు
- రాష్ట్రస్థాయి పోటీల్లో అద్భుత ప్రదర్శన

జనవాహిని ప్రతినిధి తాండూరు : ఖేలో ఇండియా ఉమెన్స్ ఓపెన్ టు ఆల్ షూటింగ్ బాల్ ఎంపికలు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో విజయవంతంగా ముగిశాయి. తెలంగాణ రాష్ట్ర షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆదేశాల మేరకు, ఈ నెల 6వ తేదీన (శనివారం) తాండూరు పట్టణంలో నిర్వహించిన ఈ ఎంపికలకు రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల నుంచి మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.వికారాబాద్ జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాములు పర్యవేక్షణలో ఈ ఎంపిక కార్యక్రమం జరిగింది. ఉమ్మడి జిల్లా చైర్మన్ కె. ఆంజనేయులు, అధ్యక్ష కార్యదర్శులు రాములు, చంద్రమోహన్ క్రీడాకారిణులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు తదుపరి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు.

రాష్ట్రస్థాయిలో మెరిసిన వరంగల్, ఉమ్మడి రంగారెడ్డి క్రీడాకారుల కృషికి ప్రశంసలు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా షూటింగ్ బాల్ ఆధ్వర్యంలో తాండూరులో ఈ నెల 13 మరియు 14 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఖేలో ఇండియా ఉమెన్స్ షూటింగ్ బాల్ పోటీల్లో ఎంపికైన క్రీడాకారిణులు పాల్గొన్నారు. ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారిణులు తమ సత్తా చాటారు.ఈ రాష్ట్రస్థాయి పోటీల్లో వరంగల్ జిల్లా క్రీడాకారులు ప్రథమ విజేతగా నిలవగా, నల్గొండ జిల్లా జట్టు రెండవ స్థానాన్ని దక్కించుకుంది. తృతీయ స్థానంలో ఖమ్మం జిల్లా క్రీడాకారులు నిలిచారు. పోటీల నిర్వహణ, విజేతలకు బహుమతుల ప్రదానం అనంతరం క్రీడాకారిణులను ఈ ఎంపికల్లో ముఖ్య అతిధులుగా పాల్గొన్న తెలంగాణ షూటింగ్ బాల్ సెక్రెటరీ ఐలయ్య, సెంట్ మార్క్స్ ప్రిన్సిపల్ ఆరోగ్య రెడ్డి, తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గోపాల్, రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ చంద్రమోహన్, జిల్లా అధ్యక్షులు సిహెచ్ రాములు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆంజనేయులు పాల్గొని, ప్రత్యేకంగా అభినందించారు.



