డివై నర్సింలుకు గులాబీ కండువా…!

- బీఆర్ఎస్ పార్టీలో చేరిక
- కాంగ్రెస్ లో ఇలువ లేదు
- బిఆర్ఎస్ కే ప్రజల మద్దతు
- డివై నర్సింలు వెల్లడి
జనవాహిని ప్రతినిధి తాండూరు :
పెద్దేముల్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డివై నర్సింలు శనివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీని వీడి, గులాబీ కండువా కప్పుకున్నారు. రోహిత్ రెడ్డి నర్సింలుకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.”తప్పుడు హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చకపోవడంతో, గ్రామాల్లో ప్రజలు తమను నిలదీస్తున్నారని, వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియక కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు” స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సాయిపూర్ నర్సింలు, మండల పార్టీ అధ్యక్షుడు కోహీర్ శ్రీనివాస్, నరేష్ రెడ్డి, షిబ్లీ, రంగయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.



