గొడవ ఆపబోయిన వ్యక్తి హత్య…!

- ఆరుగురు నిందితుల అరెస్ట్
- వెంబడించిన గ్యాంగ్.. గొడవ ఆపబోతే హత్య:
- కిట్టు కోసం వచ్చి.. నూర్ అహ్మద్‌ను చంపిన గోపాల్
- భారీ బందోబస్తు మధ్య బాధితుడి అంత్యక్రియలు
- తాండూరులో నూర్ అహ్మద్ హత్య కేసు ఛేదన
- వివరాలు వెల్లడించిన డిఐజి ఎల్ఎస్ చౌహన్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు సమీపంలోని రాజీవ్ కాలనీలో చోటుచేసుకున్న హత్య కేసు ఊహించని మలుపు తిరిగింది. పాత కక్షల నేపథ్యంలో జరిగిన గ్యాంగ్ వార్‌లో, ఏ సంబంధం లేని ఓ షాపు యజమాని బలైపోయారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డిఐజి ఎల్.ఎస్. చౌహన్ మీడియాకు వెల్లడించారు.పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. గోపాల్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి కిట్టు అనే వ్యక్తిని చంపేందుకు వెంబడించాడు. కిట్టు ప్రాణరక్షణ కోసం ఇందిరమ్మ కాలనీలోని నూర్ అహ్మద్ అనే వ్యక్తికి చెందిన బీఫ్ షాపులోకి దూరి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు.
వెంబడించిన గ్యాంగ్‌ను చూసి.. “ఎందుకు గొడవ పడుతున్నారు?” అని అడ్డుకున్నందుకు, ఆగ్రహంతో ఊగిపోయిన గోపాల్.. షాపు యజమాని నూర్ అహ్మద్, మరియు ఆయన కుమారుడిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన నూర్ అహ్మద్ చికిత్స పొందుతూ మరణించారు.ఈ కేసులో ప్రధాన నిందితుడు గోపాల్‌తో పాటు మరో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై హత్య కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని డిఐజి పేర్కొన్నారు. హత్య నేపథ్యంలో తాండూరులో ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.నూర్ అహ్మద్ అంత్యక్రియలను పోలీసులు భారీ బందోబస్త్ మధ్య నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణమంతా నిఘా పెట్టారు.





