కాంగ్రెస్ బెదిరింపులకు భయపడొద్దు..!

- కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్
- వచ్చేది మన ప్రభుత్వామే
- పైలెట్ రోహిత్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : గ్రామాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్పంచులు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, అధికార పార్టీ బెదిరింపులను ధీటుగా ఎదుర్కోవాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తాండూరులోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని తాండూరు, పెద్దేముల్, యాలాల, బషీరాబాద్ మండలాలకు చెందిన నూతన సర్పంచులు, పార్టీ సీనియర్ నాయకులతో ఆయన సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నూతనంగా ఎన్నికైన సర్పంచులు పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించి, ఆదర్శ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు అందాల్సిన నిధులను ఏ ప్రభుత్వం కూడా అడ్డుకోలేదని, నిధుల వినియోగంలో సర్పంచులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నాయకుల వేధింపులు లేదా బెదిరింపులు ఎదురైతే బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు.రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయని, మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, కోహీర్ శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, నర్సిరెడ్డి (రాజు) తో పాటు పలువురు ముఖ్య నాయకులు, నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సందర్భంగా చర్చించారు.



