కాంగ్రెస్ బలోపేతం లక్ష్యం…!

- వికారాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా జాదవ్ ధారసింగ్ నాయక్
- నియామక పత్రం అందజేసిన టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్,ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్
- పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం
జనవాహిని ప్రతినిధి తాండూరు : వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షుడిగా జాదవ్ ధారసింగ్ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన గాంధీ భవన్లో జరిగిన కీలక సమావేశంలో నియామక పత్రాన్ని అందుకున్నారు.తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కార్యవర్గ సమావేశం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ మహేష్ గౌడ్ అధ్యక్షతన గాంధీ భవన్లో జరిగింది. ఈ సమావేశానికి ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు.వీరి చేతుల మీదుగా జాదవ్ ధారసింగ్ నాయక్ వికారాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా తన నియామక పత్రాన్ని లాంఛనంగా స్వీకరించారు.ఈ సందర్భంగా, పార్టీ నాయకత్వం జాదవ్ ధారసింగ్ నాయక్‌కు కీలక సూచనలు చేసింది.వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని వారు ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. ప్రతి గ్రామంలోనూ పార్టీ కార్యక్రమాలు, సందేశాలను విజయవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, తద్వారా పార్టీకి ప్రజల మద్దతు పెంచాలని వారు తెలియజేశారు.జాదవ్ ధారసింగ్ నాయక్ నియామకం వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, రానున్న రోజుల్లో పార్టీ మరింత క్రియాశీలకంగా పనిచేస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.ఈ నియామకంతో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యకలాపాలు మరింత వేగవంతమయ్యే అవకాశం ఉంది.



