కాంగ్రెస్ 6 గ్యారంటీలతో మోసం చేసింది..!

- ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు
- బీఆర్ఎస్ అభ్యర్థి డివై చిన్న నర్సింలుకు మద్దతుగా రోహిత్ రెడ్డి ప్రచారం
- గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పై పైలెట్ రోహిత్ రెడ్డి విమర్శలు
- పెద్దేముల్ లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి మద్దతుగా రోహిత్ రెడ్డి ప్రచారం

జనవాహిని ప్రతినిధి తాండూరు : గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం చివరి రోజైన మంగళవారం పెద్దేముళ్ మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో తాండూరు మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ నాయకులు పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి డివై చిన్న నర్సింలును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.సమావేశంలో పైలెట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో గద్దెనెక్కిన తర్వాత ప్రజలను మోసం చేసింది,” అని అన్నారు.ముఖ్యంగా, మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే ఒకసారి మోసపోయి ప్రజలు గోస పడుతున్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రజలను మోసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజలు ఈ విషయాన్ని గ్రహించి, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి,” అని ఆయన పిలుపునిచ్చారు.రాబోయేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గ్రామాలను మరింత అభివృద్ధి చేస్తాం,” అని ఆయన హామీ ఇచ్చారు.స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి డివై చిన్న నర్సింలును గెలిపించి, గ్రామాభివృద్ధికి సహకరించాలని రోహిత్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



