అవకాశం ఆశిస్తున్నా దంపతులు…!

- 24వ వార్డు బరిలో ‘టైలర్ రమేష్’ దంపతులు
- రోహిత్ఆ రెడ్డి ఆశీస్సుల కోసం విజ్ఞప్తి
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో అభ్యర్థులు బరిలో ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా మోస్తూ, నియోజకవర్గ నాయకుడు పైలట్ రోహిత్ రెడ్డి వెంటే నడుస్తున్న కార్యకర్త టైలర్ రమేష్, తన భార్య అనితతో కలిసి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. పార్టీ పట్ల తనకున్న నిబద్ధతను గుర్తించి, ఈసారి తమకు 24 వార్డ్ నుండి పోటీ చేసే అవకాశం కల్పించాలని వారు కోరుతున్నారు.పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారన్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహిస్తూ, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతూ, రోహిత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులను గడపగడపకూ చేరవేస్తున్నారు. పార్టీ విధేయుడిగా గుర్తింపు పొందిన రమేష్, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు.ప్రస్తుతం 24వ వార్డులో పట్టున్నప్పటికీ, పార్టీ ప్రయోజనాల దృష్ట్యా రోహిత్ రెడ్డి ఆదేశిస్తే ఏ వార్డు నుండైనా పోటీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని రమేష్ – అనిత దంపతులు ప్రకటించారు. ఏళ్ల తరబడి కార్యకర్తగా కష్టపడుతున్నాని, ఇప్పుడు ప్రజా ప్రతినిధిగా సేవ చేసే అవకాశం కల్పించాలి” అని వారు పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. విధేయతకే పట్టం కట్టే రోహిత్ రెడ్డి ఈసారి తమకు తప్పక అవకాశం ఇస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.



