
- ఓటర్ల జాబితాలో అక్రమాలు సవరించాలి
- కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన అభ్యర్థి పునీత
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్ల జాబితా సవరణలో జరుగుతున్న పొరపాట్లను సరిదిద్దాలని కోరుతూ స్థానిక వార్డ్ అభ్యర్థి సి. పునీత్ కుమార్ శనివారం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపాలిటీలోని 27వ వార్డు గుమస్తానగర్ కు చెందిన వాసవి కాలనీ, సలోల్లాకట్ట, గంజ్ మరియు బాలాజీ హాస్పిటల్ ప్రాంతాల ఓటర్లను నిబంధనలకు విరుద్ధంగా 25వ వార్డు జాబితాలో చేర్చారని ఆరోపించారు. ఒక వార్డు ఓటర్లను మరో వార్డులో చేర్చడం వల్ల ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని పేర్కొన్నారు.అంతేకాకుండా, అధికారులు విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఓటర్ల ఫోటోలు లేకపోవడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫోటోలు లేకపోవడం వల్ల అసలైన ఓటర్లను గుర్తించడం కష్టమవుతోందని, ఇది బోగస్ ఓట్లకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే 25వ వార్డు జాబితా నుండి 27వ వార్డు ఓటర్లను తొలగించి, వారిని తిరిగి సొంత వార్డులో చేర్చాలని డిమాండ్ చేశారు. అలాగే ఫోటోలతో కూడిన పారదర్శకమైన ఓటర్ల జాబితాను ప్రచురించాలని అధికారులను కోరారు.



