SGF జిల్లా క్రికెట్ టోర్నీ విజేత తాండూర్ జట్టు

వికారాబాద్ జట్టు పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం
తాండూరు : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ జి ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్ -14 జిల్లా స్థాయి క్రికెట్ టోర్నీలో తాండూర్ జట్టు విజేతగా నిలిచింది.. శనివారం పరిగి మినీ స్టేడియంలో తాండూరు- వికారాబాద్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వికారాబాద్ జట్టు 10 ఓవర్ల మ్యాచ్ లో 9 వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది.. అనంతరం బరిలోకి దిగిన తాండూరు జట్టు మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే, కేవలం రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసి విజేతగా నిలిచింది..ఈ టోర్నీలో తాండూర్ జట్టు కెప్టెన్, కీపర్ కనవ్ పండిట్, ఆల్ రౌండర్ రిష్విత్ చంద్ర, బౌలర్లు అభిలాష్, ఆర్నవ్ తదితరులు ఫైనల్ మ్యాచ్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.. ఈ టోర్నమెంట్లో తాండూరు జట్టు క్రీడాకారులు కనవ్ పండిట్ 94 పరుగులు, రిశ్విత్ చంద్ర 77 పరుగులు చేసి టాప్ స్కోరర్ లుగా నిలిచారు.. అలాగే టోర్నీలో అభిలాష్ పది వికెట్లు తీసి టాపర్ గా నిలిచాడు.. ఈ టోర్నీలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అనంతయ్య, క్రికెట్ టోర్నీ ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణమూర్తి, పీఈటి లు అంబదాస్, ఖాజా, నరసింహులు, రాజేందర్ రెడ్డి, గోపాల్, రాజేందర్, విజయ్ భాస్కర్, రాజు, మధు తదితరులు పాల్గొన్నారు…



