
-
మున్సిపాలిటీపై పట్టు.. యువతలో ‘మామ’ క్రేజ్
-
అనుభవం Vs అవకాశం: తాండూరు పురపాలికలో పట్లోళ్ల కుటుంబానికి ప్రాధాన్యత దక్కేనా?
- పట్లోళ్ల ఫ్యామిలీ @ 25 ఇయర్స్ ఇన్ పాలిటిక్స్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పురపాలక రాజకీయాల్లో ప్రస్తుతం ఒకటే చర్చ.. సుదీర్ఘ అనుభవం, చెక్కుచెదరని ప్రజాదరణ కలిగిన పట్లోళ్ల కుటుంబానికి ఈసారి మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కుతుందా? 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం, వివాదరహిత వ్యక్తిత్వం కలిగిన పట్లోళ్ల నర్సిములు,రత్నమాల దంపతులకు ఆ అవకాశం వరిస్తుందా అని పట్టణ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రజలతోనే అనుబంధం పట్లోళ్ల రత్నమాల, నర్సిములు దంపతులకు తాండూరు రాజకీయాలతో విడదీయలేని అనుబంధం ఉంది. గత 25 ఏళ్లుగా పురపాలక రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంటూ, నాలుగుసార్లు కౌన్సిలర్లుగా ఎన్నికై ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. 2002లోనే మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసిన అనుభవం రత్నమాల నర్సిములు సొంతం. పురపాలక పరిపాలనపై పూర్తి అవగాహన, సమస్యల పరిష్కారంలో స్పష్టమైన విజన్ ఉన్న నేతగా నర్సిములు కు గుర్తింపు ఉంది.
యువతలో ‘మామ’ క్రేజ్.. నమ్మిన వారి కోసం ‘నరసింహుడు’
పట్లోళ్ల నర్సిములు తాండూరు టౌన్లో తిరుగులేని పట్టున్న నేతగా ఎదిగారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిషన్ మాజీ మెంబర్గా సేవలందించిన ఆయనకు రాజకీయ వ్యూహాల్లోనూ, అభివృద్ధి ప్రణాళికల్లోనూ మంచి పట్టుంది. ముఖ్యంగా యువతలో ఆయనకు ఉన్న క్రేజ్ సామాన్యమైంది కాదు. అందరూ ఆప్యాయంగా ‘మామ’ అని పిలుచుకునే నర్సిములు, నమ్మిన వారి కోసం ఎంతకైనా తెగించే ధైర్యం గల నేతగా పేరుగాంచారు.అలాంటి సీనియర్ నేతకు ఇప్పటి వరకు ఎలాంటి ఉన్నత స్థానం దక్కకపోవడం అశ్చర్యం. మరి తాండూరు పట్టణ రాజకీయాలను ప్రభావితం చేయగల శక్తి ఉన్న ఈ కుటుంబానికి, సీనియారిటీ పరంగానూ, అనుభవం పరంగానూ మున్సిపల్ చైర్మన్ పదవి దక్కాలని వారి అనుచరులు, అభిమానులు కోరుకుంటున్నారు. క్లీన్ ఇమేజ్, అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉన్న రత్నమాల, నర్సిములు చైర్మన్ అయితే తాండూరు మరింత అభివృద్ధి చెందుతుందని పట్టణ వాసులు భావిస్తున్నారు. మరి అధిష్టానం ఈ సీనియారిటీకి, నమ్మకానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తుందో వేచి చూడాలి.



