శ్రీరామ సేవలో ఎస్పీ నర్సింలు టెక్సటైల్స్..!

- రామాలయ పునర్నిర్మాణానికి పట్టణ ప్రజల భాగస్వామ్యం
- వ్యక్తిగత, సామూహిక విరాళాలతో రూ. 55 వేలు సమకూర్పు
- ప్రతి ఒక్కరూ సహకరించాలి – ఆలయ కమిటీ
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూర్ పట్టణంలోని ఇంద్రనగర్ లో గల ఏకైక శ్రీరామ మందిరం పునర్నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ఈ మహత్తర కార్యానికి దాతలు, స్థానికులు తమ వంతు సహాయాన్ని అందిస్తూ ముందుకు వస్తున్నారు.ఎస్పీ నర్సిములు టెక్సటిల్స్ యజమాని ఎస్పీ నర్సింలు, తనయుడు ఎస్పీ శ్రీకాంత్ ఆలయ పునర్నిర్మాణం కోసం ఉదారంగా రూ. 25,000 ఆర్థిక సహకారాన్ని విరాళంగా అందించారు.అదే విధంగా, పట్టణంలోని 6వ వార్డు హమాలీ బస్తీకి చెందిన యువకులు, పెద్దలు సామాజిక బాధ్యతతో స్పందించారు. వీరంతా కలిసి తమ వార్డులో ఇంటింటికి తిరిగి చందాలు సేకరించారు. ఈ కృషి ద్వారా వారు రూ.30,000 జమ చేసి, ఆ మొత్తాన్ని ఆలయ కమిటీకి అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీరామ మందిరం పునర్నిర్మాణం ఒక గొప్ప యజ్ఞం లాంటిదని పేర్కొంటూ, ఆలయ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా విరాళాల రూపంలో సహకరించి, ఆ పుణ్య ఫలాన్ని అందుకోవాలని వారు కోరారు.



