రామకార్యంలో పెరుమాళ్ల వెంకట్ రెడ్డి భాగస్వామ్యం

- తాండూరు రామాలయ నిర్మాణానికి పెరుమాళ్ల వెంకట్ రెడ్డి భారీ విరాళం
- తాండూరులో అయోధ్య తరహా ఆలయ నిర్మాణం
- ఆదర్శంగా నిలిచిన పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్
జనవాహిని ప్రతినిధి తాండూరు :తాండూరు పట్టణం ఇంద్రనగర్‌లోని పురాతన రామాలయ పునర్నిర్మాణ పనులకు విరాళాల వెల్లువ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం ప్రముఖ విద్యావేత్త, పెరుమాళ్ల ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ (చైతన్య జూనియర్ కళాశాల, శ్రీ సాయి మేధ విద్యాలయ, ఆపిల్ కిడ్స్ స్కూల్ కరస్పాండెంట్) పెరుమాళ్ల వెంకట్ రెడ్డి తన ఉదారతను చాటుకున్నారు. ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులను కలిసి రూ. 51,111/- నగదును విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. భక్తిభావంతో నిర్మిస్తున్న ఈ ఆలయ పనుల్లో భాగస్వామి కావడం తన అదృష్టమని పేర్కొన్నారు. అయోధ్యలోని రామమందిరాన్ని తలపించేలా తాండూరులో ఈ ఆలయాన్ని నిర్మించడం అభినందనీయమని కమిటీ సభ్యులను కొనియాడారు. హిందూ బంధువులందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, తమ శక్తి మేరకు విరాళాలు అందించి ఆలయ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో కూడా ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.పెరుమాళ్ల వెంకట్ రెడ్డి చేసిన ఈ ఆర్థిక సాయానికి ఆలయ కమిటీ ప్రతినిధులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.



