గణిత ‘మేధ’ావుల సందడి…!

- గణిత మాంత్రికుడికి ఘన నివాళి
- శ్రీ సాయి మేధలో రామానుజన్ జయంతి వేడుకలు
- ఆకట్టుకున్న గణిత నమూనాలు
- భయం వద్దు.. గణితంపై ఇష్టం పెంచుకోండి, విద్యార్థులకు కరస్పాండెంట్ పిలుపు.
జనవాహిని ప్రతినిధి తాండూరు: గణిత శాస్త్రం అంటే భయం కాదు.. ఇష్టం అని నిరూపించారు శ్రీ సాయి మేధ విద్యార్థులు. భారతీయ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ 138వ జయంతిని పురస్కరించుకుని తాండూరులోని శివాజీ చౌక్ సమీపంలో గల శ్రీ సాయి మేధ విద్యాలయంలో సోమవారం ‘జాతీయ గణిత దినోత్సవం’ వేడుకలను పండుగలా నిర్వహించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన గణిత నమూనాలు, ఫార్ములాల చార్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించడం విశేషం. పాఠశాల కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. రామానుజన్ అందించిన 3900 సమీకరణాలు ప్రపంచానికే గర్వకారణమన్నారు. ప్రతి విద్యార్థి ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి, గణిత ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.




