ముమ్మరంగా రామాలయ పునర్నిర్మాణ పనులు

- రాములోరి సేవలో తాండూరు భక్తులు
- విరాళాలు అందజేసిన దాతలు
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు పట్టణం ఇందిరానగర్‌లో వెలసిన ఏకైక శ్రీ రామచంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. స్వామివారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ పనుల్లో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.ఆలయ నిర్మాణానికి పట్టణ ప్రముఖులు, దాతలు తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. ఆదివారం ఆలయ కమిటీకి పలువురు దాతలు కలిసి విరాళాలను అందజేశారు.
వారి వివరాలు….
రవీంద్ర ఆచార్య రూ. 51,000/-బాలాజీ మెడికల్ రాజు రూ. 25,000/- కే. శ్రీనివాస్ రెడ్డి రూ. 11,000/- విరాళం అందజేశారు. ఈ సందర్భంగా విరాళం అందజేసిన దాతలను ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రామాలయ పునర్నిర్మాణం అనేది ఒక పవిత్ర కార్యమని, ఈ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. దాతలు ఉదారంగా ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా కానీ, వస్తు రూపంలో కానీ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. రాములోరి సేవలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.



