ఘనంగా పెన్షనర్ల దినోత్సవం..!

- 13 మంది విశ్రాంత ఉద్యోగులకు సన్మానం
- నాలుగు మండలాల విశ్రాంత ఉద్యోగుల కలయిక
- ఐక్యతతో సమస్యలు పరిష్కరించుకుందాం: సంఘం నేతలు

జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం తాండూరు మండల శాఖ ఆధ్వర్యంలో ‘పెన్షనర్ల దినోత్సవాన్ని’ బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు, యాలాల, బషీరాబాద్, మరియు మోమిన్‌పేట మండలాలకు చెందిన 13 మంది విశ్రాంత ఉద్యోగులను సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో తాండూరు శాఖ అధ్యక్షులు కె. శేఖర్ మాట్లాడుతూ.. ఉద్యోగ విరమణ పొందినప్పటికీ, సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ పెన్షనర్లు అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. వారి సేవలను గుర్తించి సన్మానించుకోవడం సంతోషదాయకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి నాగయ్య, కోశాధికారి ఎస్. బస్వరాజ్, అసోసియేట్ అధ్యక్షులు కె. పద్మనాభరావు, మాజీ జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జొన్నల బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వయోవృద్ధులైన విశ్రాంత ఉద్యోగుల సమస్యలు మరియు వారి సంక్షేమంపై చర్చించారు. కార్యక్రమంలో వివిధ మండలాల నుండి వచ్చిన విశ్రాంత ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



