పోస్టల్ బ్యాంక్, ఇతర బీమా కంపెనీల ఉమ్మడిగా ఈ బీమా పథకాలను అందిస్తు్న్నాయి. 18-65 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు ఈ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాల కింద చేరవచ్చు. ప్రమాదం కారణంగా మరణం, శాశ్వత లేదా పాక్షిక వైకల్యం, అవయవాలకు నష్టం లేదా పక్షవాతం సంభవించినప్పుడు రూ. 10 నుంచి 15 లక్షల వరకు బీమా కవరేజీ ఉంటుంది. అదనంగా ఆసుపత్రి ఖర్చులు, ఓపీడీ ఖర్చులు, ఇతర ప్రమాద చికిత్స ఖర్చులను కవర్ చేస్తారు. లబ్ధిదారులు వైద్యుల నుంచి ఉచితంగా సలహాలను కూడా పొందవచ్చు. ఈ పాలసీలో ఇద్దరు పిల్లలకు రూ. 1 లక్ష వరకు విద్యా ఖర్చులు, పది రోజుల పాటు ఆసుపత్రి ఖర్చుల కోసం రోజుకు రూ. 1,000, కుటుంబం వేరే నగరంలో నివసిస్తుంటే రవాణా ఖర్చుల కోసం రూ. 25,000, అంత్యక్రియల ఖర్చుల కోసం రూ. 5,000 బీమా కంపెనీలు చెల్లిస్తాయి.