దేవర మూవీ నుంచి ఇటీవలే సెప్టెంబర్ 10వ తేదీన ట్రైలర్ వచ్చింది. దీనికి ఎక్కువ శాతం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ మాస్ యాక్షన్, కొన్ని సీక్వెన్సులు అదిరిపోయాయంటూ అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే, కొందరు మాత్రం ట్రైలర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రైలర్‌లోని కొన్ని ఫ్రేమ్‌లు, వీఎఫ్ఎక్స్ విషయాల్లో కాస్త విమర్శలు వచ్చాయి.