గుంటూరులో ఇడ్లీ, వడ అమ్ముకునే వారు
“రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసి ఉండకపోతే…కేటీఆర్ గుంటూరులో ఇడ్లీ,వడ అమ్ముకునే వారు..లేకపోతే సిద్దిపేటలో చాయ్ అమ్ముకునే వారు.రాజీవ్ గాంధీ కంప్యూటర్ ను పరిచయం చేయడం వల్లే కేటీఆర్ ఈ స్థాయికి చేరారు. వాళ్లకు అధికారం పోయినా మదం దిగలేదు. రాజీవ్ గాంధీ మరణించినా సోనియమ్మ ఏ పదవీ తీసుకోలేదు. 2004 నుంచి 2014 వరకు సోనియా, రాహుల్ ఏ పదవీ తీసుకోలేదు. ప్రాణ త్యాగం అంటే ఇందిరా, రాజీవ్ లది. పదవీ త్యాగం అంటే సోనియా, రాహుల్ గాంధీలది. తెలంగాణ బిడ్డ పీవీని దేశ ప్రధానిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది” – సీఎం రేవంత్ రెడ్డి