వైట్ పోహా గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) బ్రౌన్ రైస్ పోహా, రెడ్ రైస్ పోహా, మిక్స్డ్ గ్రెయిన్ పోహాతో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. వైట్ పోహా జీఐ 65 నుంచి 75 మధ్య ఉంటుంది. బ్రౌన్ రైస్‌తో చేసిన పోహా జీఐ 50 నుంచి 65 మధ్యలో, రెడ్ రైస్ పోహా జీఐ 50 నుంచి 65 మధ్యలో, మిక్స్డ్ గ్రెయిన్ పోహా జీఐ 45 నుంచి 60 మధ్యలో ఉంటుంది. చివరి తరహా పోహా వాడటం మరింత మంచిది. మిక్స్డ్ గ్రెయిన్ పోహాను క్వినోవా, చిరుధాన్యాలు, తృణధాన్యాలు కలిపి తయారు చేస్తారు. కాబట్టి ఇది మరింత ఆరోగ్యకరం.