“ప్రాసిక్యూషన్, ట్రైల్ ప్రాసెస్ అనేది ఒక పెద్ద శిక్షగా మారకూడదు. ఈ విషయాన్ని అన్ని కోర్టులు పాటించాలి,” అని జస్టిస్ ఉజ్జల్ భుయాన్ అన్నారు. అంతేకాదు కేజ్రీవాల్‌ని సీబీఐ అరెస్ట్ చేసిన విధానం, టైమింగ్‌ని కూడా ఆయన ప్రశ్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరును నిరుత్సాహపరిచేందుకే సీబీఐ అరెస్టు చేసి ఉండొచ్చని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ అంటే నేరాన్ని అంగీకరిస్తున్నట్టు కాదని, అందువల్ల కేజ్రీవాల్‌ని సీబీఐ అరెస్టు చేయడం సరికాదన్నారు. సీబీఐకి ‘బంధిచిన చిలుక’గా ఉన్న ముద్రను తొలగించుకోవాలని సూచించింది.