జీరోతో ప్రైజ్‍మనీతో బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్ షురూ అయింది. కంటెస్టెంట్లు ప్రతీ వారం ఆడే ఆటను బట్టి ప్రైజ్‍మనీ పెరుగుతుందని నేటి ఎపిసోడ్‍కు సంబంధించిన తొలి ప్రోమోలో నాగార్జున చెప్పారు. బాయ్స్ వర్సెస్ గర్ల్స్ మధ్య ఓ గేమ్ పెట్టారు నాగ్. హీరోల పేరు చెబితే వారు నటించిన సినిమాలను పేర్లను చెప్పాలని కంటెస్టెంట్లకు టాస్క్ ఇచ్చారు. ఈ ఆట సరదాగా సాగింది. నామినేషన్లలో డేంజర్ జోన్‍లో ఉన్న బేబక్క, నాగమణికంఠ, విష్ణుప్రియ, శేకర్ బాషా, పృథ్విరాజ్ మధ్య ఈ సీజన్ ఫస్ట్ ఎలిమినేషన్ ప్రక్రియ ఉండనుంది. బేబక్క ఎలిమినేట్ అవుతారనే అంచనాలు ఉన్నాయి. నేటి ఎపిసోడ్‍లో ఈ విషయం తేలనుంది.