వరద ప్రభావిత ప్రాంతాల్లో తాను పర్యటించకపోవడంపై వస్తున్న విమర్శలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘తాను పర్యటించాలని అనుకున్నా, తన వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందేమోనని భావించి వెళ్లలేదు” అని పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. తన పర్యటన సహాయపడేలా ఉండేలా తప్ప అదనపు భారం కాకూడదని, తాను రాలేదని కొందరు నిందలు వేస్తారని అంతే తప్ప ఇంకేం ఉండదనిచెప్పారు. విపత్తు సమయంలో నిందల కంటే ప్రజాసేవ చేయడమే ముఖ్యం’ అని పవన్ వెల్లడించారు.