మృతుల కుటుంబలు సానుభూతి
“ఛత్తీస్గఢ్ లో జరిగిన ఘటనలో ఏసోబు మరణించాడు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం, టేకుల గూడెం గ్రామానికి వేలాదిగా కదిలి వచ్చిన ప్రజలు ఏసోబు అంతిమ యాత్రలో పాల్గొని భావేద్వేగంతో ఊరేగింపుగా సాగారు. ఈనెల 5వ తేదీన ఏసోబు అంతిమ యాత్ర కొనసాగుతుండగానే మరో విషాద వార్త విన్నాం. ఒకరు ఇచ్చిన సమాచారంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథ్ పాలెం అటవీ ప్రాంతంలో ఆరుగురు మావోయిస్టులు ఉన్న మకాంను గ్రేహౌండ్స్ బలగాలు చుట్టుమట్టి విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఈ పోరాటంలో ఆండ్రి గ్రామం వద్ద ప్రాణాలర్సించిన ఏసోబు, రఘునాదపాలెం గ్రామం వద్ద లచ్చన్న, తులసీ, రాము, కోసి, గంగాల్, దుర్గేష్ లకు కన్నీటీ నివాళి అర్పిస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు, బంధు, మిత్రులకు, మా పార్టీ తరుపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం.”-మావోయిస్టు అధికారి ప్రతినిధి జగన్