ఆ ఇల్లు నాదే – దివ్వెల మాధురి
దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇల్లు తనదే అంటూ దివ్వెల మాధురి ఓ వీడియో విడుదల చేశారు. ఈ ప్రొపర్టీ తన పేరుపై ఉందని, తన ఇంటిలోకి ఎవరూ రావడానికి వీలులేదని స్పష్టం చేశారు. దువ్వాడ శ్రీనివాస్‌తో ఏమైనా సమస్య బయట తేల్చుకోవాలంటూ సలహా ఇచ్చారు. తాను గతంలో దువ్వాడ శ్రీనివాస్ కు రూ.2 కోట్లు అప్పుగా ఇచ్చానని, ఆ అప్పు తీర్చమని అడిగితే ప్రస్తుతం డబ్బులు లేవని ఇంటిని రాసిచ్చారని దివ్వెల మాధురి వీడియోలో తెలిపారు. ఈ ఇల్లు తాను కోనుక్కున్నానని, పోలీసులు తనకు రక్షణ కల్పించాలని కోరారు.