అధిక డిహెచ్టి స్థాయులకు సూచన:
ముఖంపై, నాభి చుట్టూ, ఛాతీ ప్రాంతంలో అవాంఛిత రోమాలు ఉంటే అది అధిక డిహెచ్టి స్థాయులకు సూచన. డిహెచ్టి అంటే డైహైడ్రోటెస్టోస్టెరాన్, ఇది ఒక హార్మోన్. ఇది పెరిగే కొద్దీ, పురుషుల మాదిరిగా మహిళలు శరీరంపై వెంట్రుకలు రావడం మొదలవుతుంది. ముఖం, ఛాతీ, పొట్టపై వెంట్రుకలు కనిపిస్తాయి. ఈ సమస్యను హిర్సుటిజం అంటారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి, జీవనశైలిలో మార్పులు చేయడానికి డైటీషియన్లు కొన్ని మార్గాల గురించి చెబుతున్నారు.