Wednesday, February 12, 2025

నా సామి రంగ మూవీ రివ్యూ

నటి నటులు :అక్కినేని నాగార్జున, ఆషిక రంగనాధ్, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ,రుక్సార్ థ్రిల్లన్, మిర్న మీనన్,  నాజర్, రావు రమేష్ తదితరులు 

మాటలు :బెజవాడ ప్రసన్న కుమార్ 

స్క్రీన్ ప్లే దర్శకత్వం: విజయ్ బిన్నీ

సంగీతం: కీరవాణి   

కెమెరా:శివేంద్ర దాశరధి

నిర్మాత :శ్రీనివాస చిట్టూరి

నాగార్జున అభిమానులు, ప్రేక్షకులు చాలా సంవత్సరాల నుంచి నాగ్ నుంచి ఒక మంచి మాస్ అండ్ కమర్షియల్ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న వేళ ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టిన మూవీ  నా సామి రంగ. పైగా తనకి హిట్ ఖచ్చితంగా అవసరం అనుకున్న టైం లో నాగ్   ఒక డాన్స్ మాస్టర్ కి  డైరెక్టర్ గా  అవకాశం ఇవ్వడంతో సినిమా మీద అందరిలోను క్యూరియాసిటీ కూడా ఏర్పడింది. మరి నా సామీ రంగ ఎలా ఉందో చూద్దాం.

కథ

అనాధ అయిన క్రిష్నయ్య ( నాగార్జున) అంజి ( అల్లరి నరేష్ ) లు అన్న తమ్ముళ్ళులా కలిసి ఉంటారు.ఒకరంటే ఒకరికి ప్రాణం.వీళ్ళకి  భాస్కర్( రాజ్ తరుణ్ ) అనే ఫ్రెండ్ ఉంటాడు. తమ చిన్న వయసులో సాయం చేసాడని తమ ఊరి పెద్ద (నాజర్ ) కి నమ్మిన బంటులా ఉంటారు. అదే ఊళ్ళో ఉండే వడ్డీ వ్యాపారి అలాగే మోతు బారి రైతు అయిన రావు రమేష్ కూతురు వరలక్ష్మి (ఆషిక రంగనాధ్) క్రిష్నయ్య లు 10  సంవత్సరాల క్రితమే  ఒకరికొకరు ప్రేమించుకుంటారు.కానీ రావు రమేష్ పెళ్ళికి ఒప్పుకోడు.ఇంకో పక్క   ఊరికి చెందిన ప్రెసిడెంట్ కూతురు కుమారి (రుక్సార్ థ్రిల్లన్ ) ని  భాస్కర్ ప్రేమించిన విషయంలో క్రిష్నయ్య ఊరికి కుమారి ఊరి వాళ్ళకి సంక్రాంతి ఆచారాలకి సంబంధించిన విషయంలో గొడవవతుంది.ఇంకో పక్క నాజర్ కొడుకు దాస్( అబ్దుల్లా) కృష్ణయ్యని,అంజిని చంపాలనుకుంటాడు.ఇలా జరుగుతున్న కథలో దాస్ తన పంతం నెరవేర్చుకున్నాడా? కృష్ణయ్య వరలక్ష్మి లు పదేళ్ల నుంచి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? భాస్కర్ పెళ్లి తో పాటు ఊరి సమస్యని నాగార్జున తీర్చడా అనేదే ఈ కథ ?

   

ఎనాలసిస్ 

 2019 లో మలయాళం లో వచ్చిన పోరింజు మరియం జోస్ అనే చిత్రం ఆధారంగా తెరకెక్కిన నా సామి రంగ చరిత్రలో నిలిచిపోయే సినిమా కాకపోయినా కూడా  థియేటర్ లో సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ బోర్ కొట్టదు. మేకర్స్ చాలా తెలివిగా 80  వ దశకంలో జరిగే కథ అని చెప్పడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచింది.ఫస్ట్ ఆఫ్ బాగున్నా సెకండ్ ఆఫ్ మాత్రం రొటీన్ గా అనిపిస్తుంది.  ఫస్ట్ ఆఫ్ లో నాగార్జున ,ఆషికా ల  మధ్య వచ్చిన లవ్ సీన్స్ గాని సెకండ్ ఆఫ్ లో వచ్చిన ఫ్యామిలీ సీన్స్ గాని చాలా చక్కగా కుదిరాయి.సినిమా మొత్తం విలేజ్ లోనే జరగటం నా సామి రంగ కి హెల్ప్ అయ్యింది. నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ల మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే చివరలో నాజర్ క్యారక్టర్ ని  ప్రేక్షకుల దృష్టికి  వదిలేసినట్టుగా  ఉంది. ఫైనల్ గా చెప్పుకోవాలంటే సంక్రాంతికి ఎలాంటి సినిమా రావాలో అలాంటి సినిమానే వచ్చింది. 35  ఏళ్ళ క్రితం పల్లెటూరులో మనుషులు ఎలా ఉంటారో, ఆనాటి వాతావరణం ఎలా ఉంటుందో  చాలా చక్కగా చూపించారు. అసలు నాగార్జున, దర్శకుడు విజయ్ బిన్నీ ఈ రోజుల్లో ఇలాంటి కథ ని ఎంచుకోవడం కత్తి మీద సామే అని చెప్పవచ్చు. కానీ పకడ్బందీ స్క్రీన్ ప్లే సినిమాని ఆధ్యంతం కన్నుల పండుగలా 

 చేసింది.  

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు:

ఇక నటినటుల విషయానికి వస్తే క్రిష్నయ్య క్యారక్టర్ లో నాగార్జున చాలా పవర్ ఫుల్ గా చేసాడు. అసలు ఆ పాత్ర నాగార్జున కోసమే పుట్టిందా అనే  లెవల్లో విజృంభించి నటించాడు. లవ్ సీన్స్ లో అయితే కుర్ర నాగార్జున ని చూసినట్టుగా ఉంది.పైగా సినిమా మొత్తం మాసిన గడ్డంతో  లుంగీ తోనే కనపడటం తో ఒక కొత్త నాగార్జున ని చూసినట్టుగా ఉంది. అలాగే హీరోయిన్ గా చేసిన ఆషిక రంగనాధ్ తన క్యారక్టర్ కి తగ్గట్టు రెండు వేరియేషన్స్ లోను సూపర్ గా చేసింది. ఫ్యూచర్ లో మరిన్ని తెలుగు సినిమాల్లో మెరవడం ఖాయం.ఇక అల్లరి నరేష్ తన అంజి పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. రాజ్ తరుణ్ కూడా చాలా చక్కగా చేసాడు. ఇక నాజర్  తో పాటు విలన్ గా చేసిన అబ్దుల్లా  రావు రమేష్ కూడా  తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. కీరవాణి తన సంగీతంతో సినిమాకి ప్రాణం పోయడమే కాకుండా చాలా సంవత్సరాల తర్వాత ఒక తెలుగు సినిమా విజయంలో సంగీతం కూడా భాగస్వామ్యం అయ్యిందనే మాట అందరు అనుకునేలా చేసాడు.దర్శకత్వంలో ఎలాంటి కొత్త మెరుపులు లేకపోయినా కూడా విజయ్ బిన్నీ చాలా చక్కగానే డైరెక్షన్ చేసాడు. ప్రొడక్షన్ విలువలు బాగున్నాయి. 

తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:

 చందమామ నుంచి వచ్చే వెన్నెల ఎంత హాయిని ఇస్తుందో ఈ నా సామి రంగ  కూడా అంతే హాయిని ఇస్తుంది.అలాగే  ప్రేమ, స్నేహం, నమ్మకం ఎంత గొప్పవో కూడా చెప్పింది. ఈ సంక్రాంతికి నా సామి రంగ సరైన సినిమా

రేటింగ్ :2 .75 /5                                                                                                                     

                                                                                                                                                                                                                                                                                        అరుణాచలం 

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana