హెలికాఫ్టర్ ప్రమాదంపై సందేహం
బేగంబజార్ పీఎస్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదుపై ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి స్పందించారు. సోనియా గాంధీ, చంద్రబాబు కలిసే రాజశేఖర్ రెడ్డిని హెలికాప్టర్ ప్రమాదంలో చంపారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ మరణంపై ప్రజల్లో సందేహం ఉందన్నారు. ఆ సందేహాన్ని తీర్చే శక్తి సోనియాగాంధీకి చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్ఆరే చంద్రబాబుకు రాజకీయ భిక్ష పెట్టారన్నారు. చంద్రబాబు, సోనియాగాంధీ కలిసి రాజశేఖర్ రెడ్డిని హింసించి పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. అసలు ఏ తప్పూ చేయని వైఎస్ జగన్ ను కేసుల్లో ఇరికించి 16 నెలలు అన్యాయంగా జైల్లో పెట్టారన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు మనిషి అన్నారు. రేవంత్ రెడ్డి గెలవడానికి చంద్రబాబు డబ్బులు పంపించారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి తీవ్ర విమర్శలు చేశారు.