అర్హతలు
- అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన లేదా ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు జామ్ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- వయో పరిమితి లేదు.
- అదనంగా, భారతీయ డిగ్రీ ఉన్న విదేశీయులు కూడా ఇన్స్టిట్యూట్ యొక్క విధివిధానాలకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏ కాలేజీల్లో పీజీ చేయొచ్చు?
జామ్ 2025లో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లోని వివిధ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాముల్లో అడ్మిషన్ పొందవచ్చు. దేశవ్యాప్తంగా ఐఐటీల్లో సుమారు 3000 పీజీ సీట్లు ఉన్నాయి. అలాగే, ఐఐఎస్సీ, ఎన్ఐటీలు, ఐఐఎస్టీ షిబ్పూర్, ఎస్ఎల్ఐఈటీ, డీఐఏటీల్లో 2000 సీట్లలో కూడా జామ్ 2025 ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. జామ్ ద్వారా M.Sc., M.Sc (టెక్), M.Sc.-M.Tech వంటి వివిధ మాస్టర్స్ ప్రోగ్రామ్ లకు ప్రవేశాలు ఉంటాయని ఐఐటీ ఢిల్లీ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది. వివిధ సంస్థల్లో డ్యూయల్ డిగ్రీ, ఎంఎస్ (రీసెర్చ్), జాయింట్ ఎమ్మెస్సీ-పీహెచ్డీ, ఎమ్మెస్సీ-పీహెచ్డీ డ్యూయల్ డిగ్రీ కూడా ఉంటుంది.