ఒకప్పుడు మన కంపెనీలో ఇల్లీగల్‌గా బంగారం పెట్టేందుకు ట్రై చేశావ్ కదా. ఆ పని మళ్లీ చేస్తున్నట్లుగా స్వప్నకు తెలిసేలా చేయు. స్వప్న వెళ్లి కావ్యకు చెబుతుంది. అప్పుడు నువ్ తప్పు చేస్తున్నట్లు ఇంట్లో అందరికి చెబుతుంది. కానీ, నీకు చెడ్డపేరు రాదు. నువ్ కంపెనీకి ద్రోహం చేస్తున్నావని కేవలం స్వప్నకు మాత్రమే నిరూపిస్తాం. కానీ, అందరిముందు అది నిజం చేయకుండా చేస్తాం అని రుద్రాణి అంటుంది. స్వప్నకు మాత్రమే నేను వెధవని నిరూపిస్తాం. కానీ, అందరిముందు కావ్యను వెధవని చేస్తాం అని రాహుల్ వెళ్లిపోతాడు.