శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని..
‘చెరువుల పరిరక్షణ ఎంతో కీలకం. కబ్జాదారుల చెర నుంచి చెరువులను రక్షిస్తాం. శ్రీకృష్ణుడిని ఆదర్శంగా తీసుకుని.. ప్రకృతి సంపదను పరిరక్షిస్తున్నాం. చెరువులను కబ్జా చేసే వారి భరతం పడతాం. చెరువుల్లో శ్రీమంతులు ఫాంహౌస్లు నిర్మించుకున్నారు. ఫాంహౌస్ల డ్రైనేజీ కాల్వను గండిపేటలో కలిపారు. మీ విలాసం కోసం వ్యర్థాలను చెరువులో కలుపుతారా.. అక్రమ నిర్మాణాలను వదిలే ప్రసక్తే లేదు. ఎన్ని ఒత్తిడులు వచ్చినా కబ్జాదారులను వదలం. ప్రకృతిసంపద విధ్వంసం చేస్తే ప్రకృతి ప్రకోపిస్తుంది.. చెన్నై, వయనాడ్లో ప్రకృతి ప్రకోపాన్ని చూశాం. భవిష్యత్ తరాలకు మనం ప్రకృతి సంపదను అందించాలి’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.