సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలైన థ్రిల్లర్, డేంజరస్ సినిమాల్లో నటించి ఎంతో మంది యువకుల హృదయాల్లో గిలిగింతలు రేపిన నటి అప్సర రాణి. వర్మ లాగానే ఎవరు ఏమి అనుకున్నా తన స్టైల్ ఆఫ్ సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్లే అప్సర తాజాగా ఒక కొత్త మూవీలో నటిస్తుంది.
అప్సర రాణి నుంచి తాజాగా రాచరికం అనే మూవీ వస్తుంది. ఈ రోజు ఆమె పుట్టిన రోజు. (జనవరి 12) ఈ సందర్భంగా రాచరికం మూవీ టీం ఒక స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. జుట్టంతా విరబూసుకొని నోటిలో కొడవలి ఉంచుకొని రక్తపాతం సృష్టించడానికి రెడీగా ఉన్నట్టుగా అప్సర ఉంది.ఇప్పుడు ఈ పోస్టర్ మూవీ మీద అందరిలోను ఆసక్తిని నెలకొల్పేలా చేసింది. విజయ్ శంకర్ హీరోగా నటిస్తున్న ఈ రాచరికాన్ని చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈశ్వర్ నిర్మిస్తున్నాడు.
సురేష్ లంకలపల్లి రచనా దర్శకత్వంలో వస్తున్న ఈ రాచరికంలో విజయ రామరాజు, శ్రీకాంత్ అయ్యంగార్, మహబూబ్ బాష, రూపేష్ మర్రాపు, ప్రాచీ థాకర్, లత, ఈశ్వర్ తదితరులు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.వెంగి సంగీతాన్ని అందించగా, ఆర్య సాయి కృష్ణ కెమెరామెన్ బాధ్యతలని నిర్వహిస్తున్నాడు.