సూర్య భగవానుడు నెలకి ఒకసారి రాశి చక్రం మార్చుకుంటూ ఉంటాడు. సూర్య సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలగబోతుంది. సూర్యుడు శుభ స్థానంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి గౌరవం, సంపద పెరుగుతాయి. సూర్యుడు తమ కుమారుడి శని సొంత రాశి మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆరోజు చేసే దానాల ఫలితం మీకు లభిస్తుంది. శని దేవుడు కూడా మీమీద దయ చూపిస్తాడు. సూర్యుడిని పూజించడం వల్ల శని కూడా సంతోషిస్తాడు. సూర్యుడు రాశి మారడం వల్ల ఈ నాలుగు రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు చేకూరనున్నాయి.