అధికార పార్టీ చోడవరం ఎమ్మెల్యే కె ఎస్ ఎన్ రాజు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనవసరంగా స్కీములు పెట్టారని ఎమ్మెల్యే రాజు అన్నారు. ఈ పథకాల డబ్బుతో జనం బిర్యాణీలు తెచ్చుకోవటం సహా అనేక రకాల పనులకు ఈ డబ్బు వాడుతున్నారని వాపోయారు. ప్రజల ఖాతాల్లో డబ్బులు వెయ్యొద్దని సీఎం చంద్రబాబుకు చెప్పానని పేర్కొన్నారు.