Palak Pesarattu: పెసరట్టుకు అభిమానులు ఎక్కువ. పెసరట్టు ఉప్మా, మసాలా పెసరట్టు, ఆనియన్ పెసరట్టు ఎక్కువ మందికి ఇష్టం. ఎప్పుడూ అవే తింటే బోర్ కొడుతుంది. ఒకసారి పాలక్ పెసరట్టు తిని చూడండి. దీనివల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. ఇది ప్రోటీన్ నిండిన దోశగా చెప్పుకోవచ్చు. పాలకూర తినేందుకు ఇష్టపడని పిల్లలకు, ఇలా పాలక్ పెసరట్టు వండి పెడితే వారికి ఇందులోని పోషకాలు పుష్కలంగా అందుతాయి.