Shadow Boxing: అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతిరోజూ వాకింగ్, రన్నింగ్ ఎలా చేస్తారో… అలా షాడో బాక్సింగ్ కూడా ఒక ఐదు నిమిషాలు చేయడం చాలా అవసరం. దీన్ని చేయడం చాలా సులువు. ఎలాంటి పరికరాలు అవసరం లేదు. ఇంట్లోనే దీన్ని చేసుకోవచ్చు. షాడో బాక్సింగ్ అంటే గాలిలో పంచ్‌లు విసరడం. చాలా బలంగా గాలిలో పంచ్‌లు విసురుతూ ఉండాలి. దీన్ని ఎయిర్ పంచింగ్ అని కూడా అంటారు. మీరు పంచ్ విసిరినప్పుడు మీ శరీరంలోని ఎగువ భాగంలో ఉన్న కండరాలు శక్తివంతంగా పనిచేస్తాయి. భుజాలు, ముంజేయి, ఛాతీ, పొత్తికడుపు, ట్రైసెప్స్ దగ్గర ఉన్న కండరాలన్నీ పంచింగ్ సమయంలో చురుగ్గా ఉంటాయి. అక్కడ ఉన్న కొవ్వు కరిగే అవకాశం ఉంటుంది.