Guntur Kaaram Twitter Review: మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా శుక్రవారం (నేడు) ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా రోజుల తర్వాత పూర్తిస్థాయి మాస్ పాత్రలో మహేష్‌బాబు నటిస్తోన్న సినిమా ఇది. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే వైబ్‌ను క్రియేట్ చేసిన ఈ మూవీపై టీజర్స్, ట్రైలర్స్‌తో అంచనాలు ఆకాశాన్నాంటాయి. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు. గుంటూరు కారం మూవీ ఎలా ఉంది? ఈ సినిమాతో మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబోలో బ్లాక్‌బస్టర్ హిట్ పడిందా? లేదా? అన్నది చూద్దాం…