Thursday, January 16, 2025
Dacoit: ‘డెకాయిట్’ – శత్రువులుగా మారిన ప్రేమికులుగా అడివి శేష్, శృతి హాసన్!
Dacoit Title Teaser starring Adivi Sesh and Shruti Haasan is here: యంగ్ హీరో అడివి శేష్, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ జంటగా రూపొందుతోన్న పాన్ ఇండియా సినిమాకు ‘డెకాయిట్’ టైటిల్ ఖరారు చేశారు. ఒక ప్రేమ కథ… అనేది ఉప శీర్షిక. అంతే కాదు… ఈ రోజు టైటిల్ టీజర్ కూడా విడుదల చేశారు. 
దేవుడు చచ్చిపోయాడు… ఆ టాటూ చూశారా?
Dacoit Title Teaser Review: తుపాకీ నుంచి తూటాలు వర్షంలా వస్తున్న శబ్దాలు… అల్లర్లు, బాంబు దాడులు వంటివి జరిగినప్పుడు కనిపించే దృశ్యాలు… తగలబడిన బైకులు… మధ్యలో పోలీసుల శవాలు… ఆ తర్వాత హీరో అడివి శేష్ తెరపైకి ఎంట్రీ ఇచ్చారు. 
’జూలియట్… ఎన్ని ఏళ్ళు అయ్యింది మనం కలిసి!’ అని అడివి శేష్ అడిగారు. ఆ సమయంలో ఆయన మెడపై చూస్తే ‘గాడ్ ఈజ్ డెడ్’ (దేవుడు చచ్చిపోయాడు) అని రాసి ఉన్న టాటూ సైతం కనిపించింది. ‘కలిసి కాదు… విడిపోయి’ అని శృతి హాసన్ నుంచి సమాచారం! చీర కట్టుకుని కనిపించినప్పటికీ… చేతిలో తుపాకీ! 
Also Read: <a title=”‘సలార్’కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ – చెత్త రాజకీయాలకు తెర తీసిన పీవీఆర్!” href=”https://telugu.abplive.com/entertainment/shah-rukh-khan-called-owners-of-pvr-inox-asking-them-not-to-allocate-screens-for-salaar-134476″ target=”_blank” rel=”dofollow noopener”>’సలార్’కు థియేటర్లు ఇవ్వొద్దంటూ షారుఖ్ ఫోన్ – చెత్త రాజకీయాలకు తెర తీసిన పీవీఆర్!
నాగార్జున మేనకోడలు సుప్రియ నిర్మాణంలో…
అడివి శేష్, శ్రుతి హాసన్ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్స్ సంస్థలపై కింగ్ అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda) ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆమె చాలా రోజులుగా అన్నపూర్ణ స్టూడియోస్, సెవెన్ ఎకర్స్ స్టూడియోస్, ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. సోదరుడు సుమంత్ నటించిన సినిమాలకు ఆమె సమర్పకురాలిగా వ్యవహరించారు. అయితే… పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మీద సుప్రియ ఓ సినిమా ప్రొడ్యూస్ చేస్తుండటం ఇదే తొలిసారి. ఈ చిత్రానికి సునీల్ నారంగ్ సహ నిర్మాత.
Also Read: <a title=”ప్రభాస్ ముందు కొండంత టార్గెట్ – థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే ‘సలార్’ హిట్?” href=”https://telugu.abplive.com/entertainment/salaar-breakeven-target-worldwide-distribution-rights-details-telugu-news-134454″ target=”_blank” rel=”dofollow noopener”>ప్రభాస్ ముందు కొండంత టార్గెట్ – థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు వస్తే ‘సలార్’ హిట్?
ఈ చిత్రానికి షానియల్ డియో దర్శకుడు. అడివి శేష్ ‘క్షణం’, ‘గూఢచారి’ చిత్రాలకు కెమెరా వర్క్ అందించారు. ఇప్పుడీ సినిమాతో సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్టర్ అవుతున్నారు. కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన, విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘లైలా’ షార్ట్ ఫిలింకు షానియల్ డియో డైరెక్ట్ చేశారు.
Related Articles
Stay Connected
0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img
Telangana