విరాట్ కోహ్లీ..ఈ పేరు చెప్తే చాలు క్రికెట్ ప్రేమికులు పూనకం వచ్చిన వాళ్ళల్లా ఊగిపోతారు. ఎంతటి కఠిన పరిస్థితుల్లో అయినా సరే ఎలాంటి టెన్షన్ లేకుండా ఆడి జట్టుని గెలిపించడం విరాట్ స్టైల్. తాజాగా ఒక ఫేమస్ హీరోయిన్ విరాట్ కి మరదలు అవుతుందనే వార్తలు బయటకి రావడంతో అందరు ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు.
సుశాంత్ హీరోగా వచ్చిన చిలసౌ అనే సినిమాతో తెలుగు సినిమారంగ ప్రవేశం చేసిన రుహనీ శర్మ ప్రస్తుతం వెంకటేష్ హీరోగా జనవరి 13 న రిలీజ్ అవుతున్న సైంధవ్ లో నటిస్తుంది.రుహనీ కి విరాట్ భార్య అనుష్క శర్మ వరుసకి సోదరి అవుతుంది. అంటే విరాట్ కి రుహనీ మరదలు అవుతుంది.సైంధవ్ ప్రమోషన్స్ కి సంబంధించి రుహనీ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో ఆ విషయం బయటపడింది.
ఈ ఇంటర్వ్యూ లోనే ఆమె మాట్లాడుతు చిన్నప్పటినుంచి వెంకటేష్ సినిమాలు చూస్తూ పెరిగానని ఆయనతో కలిసి నటించాక మరింత ఫ్యాన్ గా మారానని కూడా చెప్పింది. అలాగే డాక్టర్ అవ్వాలనే కోరికసైంధవ్ తో తీరిందని కూడా ఆమె చెప్పింది. విరాట్, అనుష్క లు తనతో చాలా బాగుంటారని కూడా రుహనీ చెప్పింది.