Wednesday, October 30, 2024

హుస్నాబాద్ అభివృద్ధే నా ప్రాధాన్యత, అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించను- మంత్రి పొన్నం ప్రభాకర్-medak news in telugu minister ponnam prabhakar warns officials do not neglect public problems ,తెలంగాణ న్యూస్

హుస్నాబాద్ అభివృద్ధికి రూ.10 కోట్లు

నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.10 కోట్లు కేటాయించిందని, వాటితో ప్రజలకు అత్యవసరమైన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపడుదామని మంత్రి పొన్నం తెలిపారు. వాటికి ప్రతిపాదనలు తయారుచేసి ఇవ్వాలని, నిర్మాణాలు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటి వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. వివిధ గ్రామాలను కలిపే రోడ్లు, హై లెవెల్ బ్రిడ్జిలు, బీటీ రోడ్ రెన్యువల్, విద్యుత్ అవసరాలు అన్ని వివరాలను సేకరించాలన్నారు. నియోజకవర్గ పరిధిలోని 305 ఆవాసాలలో రాబోయే ఎండాకాలంలో ఎలాంటి తాగునీటి ఎద్దడి రాకుండా ఆర్డబ్ల్యూఎస్ ఇంజినీర్లతో పాటు తహసీల్దారులు, ఎంపీడీవోలు క్షేత్రస్థాయిలో మరొకసారి క్షుణ్ణంగా పరిశీలించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల విధానాలు వేరువేరుగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వ పథకాల సమాచారాన్ని కూడా అధికారులు సేకరించి అభివృద్ధికి ఉపయోగించాలన్నారు. విద్యార్థి నాయకునిగా పనిచేసినందున తనకు విద్య వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధ ఉంది. మండల స్థాయి అధికారులు మండలంలోని అన్ని రకాల గురుకుల విద్యాసంస్థలు, వసతి గృహాలను, మోడల్ స్కూల్ లను విజిట్ చేసి విద్యార్థులకు అందిస్తున్న ఆహార నాణ్యత, వసతి, ఎడ్యుకేషన్ క్వాలిటీని పరిశీలించాలని సూచించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana