యువ శక్తికి పట్టం..!

- కరణ్‌కోట్‌లో టీఆర్‌ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా బోయ అశోక్ కుమార్ నామినేషన్
జనవాహిని ప్రతినిధి తాండూరు : తాండూరు మండలంలోని కరణ్‌కోట్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తూ, టీఆర్‌ఎస్ పార్టీ తరఫున బోయ అశోక్ కుమార్ సర్పంచ్ అభ్యర్థిగా శనివారం నామినేషన్ దాఖలు చేశారు.గ్రామంలో విద్య, ఉద్యోగం, సామాజిక సేవారంగాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ ప్రజల మన్ననలు పొందిన బోయ అశోక్ కుమార్ నామినేషన్ సందర్భంగా పెద్ద సంఖ్యలో గ్రామస్థులు, యువత, పార్టీ నాయకులు తరలివచ్చారు. యువ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి, మార్పును ఆకాంక్షిస్తున్న తీరుకు ఇది నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్బంగా అశోక్ కుమార్ మాట్లాడుతూ….. గ్రామాభివృద్ధి, యువతకు మెరుగైన అవకాశాలు, మహిళల భద్రత నా ప్రధాన లక్ష్యాలు. కరణ్‌కోట్‌ను అభివృద్ధిలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి నేను శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా, గ్రామ ప్రజలందరి సహకారంతో ముందుకు సాగుతాను,” అని నామినేషన్ అనంతరం అశోక్ కుమార్ ఉద్వేగంగా తెలిపారు. సాంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా, నిబద్ధత, ఉత్సాహం నిండిన యువ నాయకుడు ఎన్నికల బరిలోకి దిగడంపై గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువ శక్తి ద్వారా గ్రామానికి కొత్త దిశ, దశ లభిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు.



