అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు జనవరి 22న ముహూర్తం ఖరారు చేశారు.ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే రామయ్య పాదుకలు తయారు చేసే భాగ్యం భాగ్యనగర వాసికి దక్కింది. సికింద్రాబాద్ బోయిన్పల్లిలోనే ప్రత్యేకంగా తయారు చేయించారు. శ్రీమద్విరాట్ కళా కుటీర్ లోహ శిల్పి రామలింగచారి చేతుల మీదుగా పాదుకులు తయారు చేయించారు. ఈ పాదుకుల తయారీ కోసం దాదాపుగా 15 కిలోల పంచలోహంతో కూడిన వెండి , బంగారు తాపడం వాడినట్టు లోహ శిల్పి పిట్లంపల్లి రామలింగచారి పేర్కొన్నారు.