హైదరాబాదులోని నాపంల్లి రైల్వే స్టేషన్లో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ ఫామ్ సైడ్ వాల్‌ను ట్రైన్ ఢీ కొట్టింది. చెన్నై నుంచి ఎక్స్‌ప్రెస్ రైలు హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో బోగీలు పట్టాలు తప్పి పక్కకు వంగిపోయాయి. ప్రమాదంలో పలువురు గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.