తాడేపల్లిలో సీఎం జగన్ ని కలిసిన అనంతరం ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమల YCP ఎమ్మెల్యే జొన్నగడ్డ పద్మావతి మీడియాతో మాట్లాడారు. తన మాటలను వక్రీకరించారని అన్నారు. నా పోరాటం అధికారుల మీద మాత్రమేనని జొన్నల గడ్డ పద్మావతి వివరించారు. సీటు ఎవరికి ఇచ్చినా కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మీడియాకు ఆమె వార్నింగ్ ఇచ్చారు.